యూపీ ఆగ్రాలోని కినారి బజార్‌లోని ఒక వెండి ఫ్యాక్టరీలో గురువారం పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. కార్మికులు వెండిని కరిగించే సమయంలో ఫర్నేస్ అకస్మాత్తుగా పేలడంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు మూడు ఫర్నేసులను దెబ్బతీసింది. పేలుడు తీవ్రతకు మొత్తం భవనం కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతం పొగతో నిండిపోయింది. అగ్నిమాపక దళం అతికష్టంపై మంటలు ఆర్పింది.