రెండేళ్ల క్రితం ముంబయిలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్
అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణలో ఎన్ఐఏ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
అంబానీ కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేసేందుకు మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే ప్రయత్నించాడని తెలిపింది. కాగా ఇతని బెయిల్‌ను నిరాకరిస్తూ సెప్టెంబర్ 16న ఇచ్చిన ఆర్డర్ కాపీలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి.