బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత..

76చూసినవారు
బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత..
పద్మ అవార్డులపై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్నాయి. తాజాగా నాంపల్లి BJP కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. బండి కామెంట్లపై TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ.. RSS, BJP నేతలకే పద్మ అవార్డులు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. బండి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్