ఇజ్రాయెల్ సైన్యాధిపతిగా మాజీ మేజర్ జనరల్ ఇయల్ జమీర్ నియమితులయ్యారు. ఈ మేరకు దేశ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి కాట్జ్‌లు సంయుక్తంగా ఆయనను ఎంపిక చేశారు. ఇజ్రాయెల్ సైన్యంలో 28 ఏళ్లు పనిచేసిన అనుభవం జమీర్‌కు ఉంది. 2018 నుంచి 2021 వరకు మిలిటరీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. దక్షిణ కమాండర్లకు సైతం ఆయన నాయకత్వం వహించారు.