2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మావోయిస్టులతో శాంతి చర్చలు జరిగాయి. అక్టోబర్ 15-18 మధ్య జరిగిన ఈ చర్చలు 2005 జనవరి 17న మావోయిస్టులు తప్పుకోవడంతో విఫలమయ్యాయి. 2004 ఎన్నికల ముందు టీడీపీ హయాంలో మావోయిస్టుల ఏరివేత జరిగినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనినే కొనసాగించింది. ఆ తర్వాత కూడా చర్చల అంశం చర్చనీయాంశంగా మిగిలింది. ఇప్పుడు తాజాగా ఈ చర్చల అంశం మరోసారి ముందుకొచ్చింది.