ఏపీలో శనివారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెందిన జి.చరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లా తగరపువలస గ్రామం కొండపేటకు చెందిన చరణ్.. పరీక్షల్లో తప్పానని తల్లిదండ్రులకు చెప్పాడు. వారుకూడా ఏం భయపడవద్దని, మళ్లీ పరీక్షలు రాయెుచ్చని ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. అయినా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఫ్యాన్‌కి ఉరివేసుకున్నాడు.
(NOTE: పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. అంతేగాని ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవొద్దు)