ఓ నకిలీ కార్డియాలజిస్ట్ 70 మందికి శస్త్రచికిత్సలు చేయగా, వారిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలోని బాద్షా ఖాన్ ఆసుపత్రిలో పంకజ్ మోహన్ గుండె వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడు నకిలీ బిల్లులు పెట్టి నగదును తీసుకుంటున్నట్లు న్యాయవాది సంజయ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరే ఉన్న మరో వైద్యుడి ముసుగులో పంకజ్ మోహన్ కార్డియాలజిస్ట్ ఉద్యోగం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది.