యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఆపరేషన్ చేసిన నకిలీ వైద్యుడు..15 ఏళ్ల బాలుడు మృతి

71చూసినవారు
యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఆపరేషన్ చేసిన నకిలీ వైద్యుడు..15 ఏళ్ల బాలుడు మృతి
బిహార్ లో నకిలీ వైద్యుడి నిర్వాకంతో ఓ బాలుడు మృతి చెందాడు. చందన్ షా అనే వ్యక్తి తన 15 ఏళ్ల కుమారుడిని చికిత్స కోసం గణపతి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అక్కడ అజిత్ కుమార్ పూరి అనే నకిలీ వైద్యుడు చేసిన సర్జరీ కారణంగా తన కుమారుడు చనిపోయాడని షా ఆరోపించారు. తన కుమారుడికి పిత్తాశయంలోని రాయిని తొలగించేందుకు ఆ డాక్టర్ యూట్యూబ్ లో వీడియో చూసి సర్జరీ చేశాడని ఆయన తెలిపారు. శస్త్రచికిత్స వికటించడంతో బాలుడిని మరో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు వదిలాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్