తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్ చల్ చేస్తున్నారు. ఫేక్ ఐడీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. రోజుకో నకిలీ ఉద్యోగిని పట్టుకుంటున్నట్లు భద్రతా సిబ్బంది గురువారం వెల్లడించారు. తహశీల్దార్ పేరుతో ఇవాళ వచ్చిన కొంపల్లి అంజయ్యను గుర్తించి.. సైఫాబాద్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.