కల్నల్ సోఫియా ఇంటిపై దాడి అంటూ ఫేక్ న్యూస్ వైరల్ (వీడియో)

62చూసినవారు
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను గడగడలాడించిన కల్నల్ సోఫియా ఖురేషి‌పై అనిస్ ఉద్దీన్ అనే వ్యక్తి నెట్టింట ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నాడు. కర్ణాటకలోని సోఫియా ఇంటిపై ఉగ్రవాది దాడి చేశాడంటూ కొన్ని పాత ఫొటోలు Xలో పోస్ట్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. అది ఫేక్ న్యూస్ అని తెలియడంతో అనిస్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోఫియా ఇంటిపై ఎలాంటి దాడి జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యలుగా ఖురేషి ఇంటికి భద్రత కల్పించారు.

సంబంధిత పోస్ట్