ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్‌ను ఆదివారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. కంపెనీలో డిపాజిట్ చేసిన వారికి అధిక వడ్డీలతో లాభాలు ఇస్తామని ప్రచారం చేసి 7056 మంది డిపాజిట్‌దారుల నుంచి సుమారు రూ.4వేల కోట్లు ఫాల్కన్ గ్రూప్ వసూలు చేసిందని వెల్లడించారు. కాగా ఫాల్కన్ కేసులో ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.