కులగణన సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,12,15,134: భట్టి

71చూసినవారు
కులగణన సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,12,15,134: భట్టి
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కులగణనపై పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. చిన్న పొరపాటు లేకుండా కులగణన సర్వే చేపట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సర్వేలో పాల్గొన్నవారు 3 కోట్ల 70 లక్షల మంది ఉన్నారని అన్నారు. లిస్టింగ్‌ చేసిన కుటుంబాలు 1,15,71,457 కాగా, 1,12,15,134 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయని తెలిపారు. కులగణన విజయవంతం కాకూడదని.. కేసీఆర్‌ కుటుంబం సర్వేలో పాల్గొనలేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్