తెలంగాణలో ఇంటి మహిళే యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు

72చూసినవారు
తెలంగాణలో ఇంటి మహిళే యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మ‌హిళ‌నే ఇంటి య‌జ‌మానిగా గుర్తించాల‌ని, ఇత‌ర కుటుంబ స‌భ్యుల వివరాలను కార్డు వెనుక ఉంచాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. అక్టోబర్ 3న పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఇంటింటి పరిశీలన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ డేటా ఆధారంగా ప్రస్తుతం కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్