రాజ్యసభలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ రంగులు మార్చు పార్టీ అని, ఫ్యామిలీ ఫస్ట్ కాంగ్రెస్ విధానమని దుయ్యబట్టారు. ప్రజల కళ్లకు గంతలు కట్టి తమ అధికారాన్ని కాపాడుకున్నారని విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో దేశ అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చామని, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశామని పేర్కొన్నారు.