నటి ప్రీతి జింగ్యానీ భర్త, బాలీవుడ్ నటుడు పర్విన్ దాబాస్‌కు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఆయన కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. బాంద్రాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. ప్రీతి జింగ్యానీ తెలుగులో తమ్ముడు, నరసింహనాయుడు, అధిపతి, యమదొంగ, విశాఖ ఎక్స్‌ప్రెస్ తదితర చిత్రాల్లో నటించారు.