హిందీ చిత్రపరిశ్రమను ఉద్దేశించి రామ్‌గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.'పుష్ప 2' వంటి చిత్రాలను బాలీవుడ్ వాళ్లు తెరకెక్కించలేకపోతున్నారని తెలిపారు. సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ విధంగా ఏమాత్రం వారు ఆలోచించడం లేదని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ నుంచే సౌత్ నటీనటులు గతంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారని.. ఇక్కడి స్టార్ హీరోలు ఒకప్పుడు హిందీ చిత్రాలను రీమేక్ చేసేవారని అన్నారు. కానీ, ప్రస్తుతం ఉల్టా అయిందని అన్నారు.