ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గురవారం రైల్వేస్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లీని చూసేందుకు ఎంతో మంది అభిమానులు తరలి వచ్చారు. అయితే వీరిలో ఓ అభిమాని మాత్రం రంజీ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా విరాట్ కోహ్లీ వద్దకు పరుగెట్టుకు వెళ్లి ఆయన కాళ్లు మొక్కాడు. ఈలోగా సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని బయటికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.