AP: కాకినాడ జిల్లా జగ్గంపేటలో ‘గేమ్ ఛేంజర్’ మూవీ సినిమా హాల్లో మెగా అభిమానులు ఆందోళనకు దిగారు. ఆ థియేటర్‌లో అర గంట పాటు సినిమా వేయలేదని ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి బెనిఫిట్ షో కోసమని తమకు అధిక ధరలకు టికెట్లు విక్రయించి, ఒంటి గంట వరకు షో వేయలేదని మండిపడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా మూవీ వేయడంలో ఆలస్యం చేశారని ఆగ్రహించారు. ఆ తర్వాత షో పడటంతో అభిమానులు శాంతించారు.