పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

54చూసినవారు
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
TG: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి(D), మోత్కూరు(M)లోని రాగిబావి గ్రామంలో చోటు చేసుకుంది. పెసర అశోక‌రెడ్డి(55) అనే రైతు అప్పుల బాధను తాళలేక గురువారం ఉదయం గ్రామం మధ్యలో పురుగుల మందు తాగాడు. అపస్మారగా స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్