నీళ్లు లేక పంట ఎండిపోయి మనస్తాపంతో రైతు ఆత్మహత్య

74చూసినవారు
సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాయపోల్ మండలం మంతూర్ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోయి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అప్పుల భారం తట్టుకోలేక మనస్తాపానికి గురైన రైతు ఈరమైన మల్లయ్య (45) తన పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్