TG: మహబూబ్‌నగర్‌లో శనివారం జరగనున్న రైతు పండుగ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. సాయంత్రం మూడు గంటలకు హెలికాప్టర్ ద్వారా భూత్పూర్ సమీపంలోని అమిస్తాపూర్‌కు చేరుకొని నాలుగు గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. సభలో పాలమూరు ప్రజలకు హామీల వర్షం కురిపించే అవకాశం ఉంది. రూ.2 లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు తెలిపాయి.