తెలంగాణలో వ్యవసాయానికి పనికిరాని భూములకు రైతు భరోసా కట్ చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. రైతు పంట వేసినా వేయకున్నా, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరం భూమికి భరోసా ఇవ్వాలన్నారు. 'రియల్ భూములు, లేఅవుట్ భూములు, నాలా కన్వర్ట్ భూములు, మైనింగ్ భూములు, గోదాములు నిర్మించిన భూముల వివరాలను సేకరించాలి. పంచాయతీ, మున్సిపాలిటీల రెవెన్యూ రికార్డులు, సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవాలి' అని సూచించారు.