తెలంగాణలో రైతులు పుట్టెడు దుఃఖంలో ఉన్నారని BRS మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. పంటలు ఎండిపోయి కొందరు రైతులు బాధలో ఉంటే.. మరి కొందరు అకాల వర్షాలకు నష్టపోయారని అన్నారు. 'రైతుల పరిస్థితి ఘోరంగా తయారైంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతు డిక్లరేషన్‌లో పంట ఏ రకంగా నష్టపోయినా పరిహారం ఇస్తామని వాగ్దానం చేశారు. కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తామన్నారు. పంటల బీమా పథకం తెస్తామని తేలేదు' అని ప్రభుత్వాన్ని విమర్శించారు.