రైతుల సమాచారం విదేశాలకు వెళ్లింది: CM రేవంత్

54చూసినవారు
రైతుల సమాచారం విదేశాలకు వెళ్లింది: CM రేవంత్
ఆర్థిక నేరాలకు పాల్పడే దేశాల్లోని సంస్థ చేతికి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారని సీఎం రేవంత్ ఆరోపించారు. 'ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జీన్ హైలాండ్ దేశాలకు రైతుల సమాచారం వెళ్లింది. పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈవోగా గాదె శ్రీధర్ రాజే ఉన్నారు. అత్యంత సున్నితమైన సమాచారం విదేశీయుల చేతిలో పెట్టారు. ఇది తీవ్రమైన నేరం. బాధ్యులకు తప్పకుండా శిక్ష పడాలి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్