తెలంగాణలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రేపు/ఎల్లుండి రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే ఎకరా వరకు భూమి ఉన్న వారికి ప్రభుత్వం రూ.6 వేల చొప్పున జమ చేసింది. గతంలోలాగా ఎకరా, రెండు ఎకరాలు, 3 ఎకరాలకు విడతల వారీగా రైతు భరోసా సాయం అందించాలని ప్రభుత్వంనిర్ణయించింది. తొలి విడతలో దాదాపు 17 లక్షల మందికి భరోసా డబ్బులు ఖాతాల్లో వేసినట్లు సమాచారం.