తెలంగాణలో ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు యాసంగి రైతుబంధు కూడా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని BRS నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. చాలామంది చనిపోయిన రైతులకు రైతుబీమా అందడం లేదని మండిపడ్డారు. వెంటనే చనిపోయిన రైతు కుటుంబాలకు రైతుబీమా డబ్బులను విడుదల చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు వచ్చే వానకాలానికి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.