ఈ నెలాఖరులోగా రైతుభరోసా డబ్బులు: మంత్రి తుమ్మల

55చూసినవారు
ఈ నెలాఖరులోగా రైతుభరోసా డబ్బులు: మంత్రి తుమ్మల
TG: రైతుభరోసా డబ్బులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్‌న్యూస్ చెప్పారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుభరోసా నిధులు ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని తెలిపారు. ఈ నెల 25వ తేదీలోగా ఎకరాకు రూ.6 వేల చొప్పున నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. వచ్చేనెల చివరి వరకు రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, మిగతావి ఆగస్టు తర్వాత వస్తాయని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్