రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి: శివరాజ్‌సింగ్

59చూసినవారు
రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి: శివరాజ్‌సింగ్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం లక్నోలో 'ప్రకృతిక్ ఖేతికి విజ్ఞాన్ పార్ క్షేత్రే పరమర్ష్ ప్రోగ్రామ్'లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ పొలాల్లో కనీసం ఒక భాగమైనా సేంద్రియ వ్యవసాయం చేయాలని, వారి పంట నష్టానికి ప్రభుత్వం రెండేళ్లపాటు రాయితీలు ఇస్తుందన్నారు. యువ రైతులు రసాయన రహిత వ్యవసాయం చేస్తూ భూమిని కాపాడాలి. త్వరలో కోటి మంది రైతులకు సహజ సేద్యంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్