స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుభరోసా ఇవ్వరు: KTR

0చూసినవారు
TG: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుభరోసా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని రైతుభరోసా డబ్బులు వేశారు. నాలుగు పంటలు కలిపి పట్టాదారు రైతులకు రూ.24 వేల కోట్లు, కౌలు రైతులకు రూ.15 వేల కోట్లు.. మొత్తం రూ.39 వేల కోట్లు ఎగగొట్టారు. కేసీఆర్ నాట్లు వేసేటప్పుడు రైతుబంధు వేస్తే, రేవంత్ ఓట్లు వేసేటప్పుడు రైతుభరోసా వేస్తున్నారు' అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్