ఘోర విషాదం.. పిడుగుపాటుకు నలుగురు మృతి

78చూసినవారు
ఘోర విషాదం.. పిడుగుపాటుకు నలుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం నలుగురు రైతులను పొట్టనబెట్టుకుంది. ఏజెన్సీలోని గాదిగూడ మండలం పిప్పిరిలో 14 మంది రైతులు వ్యవసాయ కూలీలతో కలిసి మొక్కజొన్న విత్తులు వేసే క్రమంలో భారీ వర్షం కురవడంతో పొలంలో ఏర్పాటు చేసిన గుడిసెలోకి వెళ్లారు. అదే క్రమంలో గుడిసెపై పిడుగు పడటంతో మాదర్రావు(45), సంజన(22), మంగం భీంబాయి(40), సిడాం రాంబాయి (45) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 10మందిని రిమ్స్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్