సౌదీలో ఘోర ప్రమాదం.. 9 మంది భారతీయులు మృతి

82చూసినవారు
సౌదీలో ఘోర ప్రమాదం.. 9 మంది భారతీయులు మృతి
సౌదీ అరేబియాలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ  ఘటనలో తొమ్మిది మంది భారతీయులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అంకితభావంతో సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్