ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

66చూసినవారు
ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోయలో పడిపోయింది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అత్యవసర బృందాలు క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్