మహాకుంభమేళా నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మినీ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం మృతి చెందిన వారు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కాగా వీరు కుంభమేళాకు నుంచి హైదరాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగి ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.