TG: హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఓ సెల్లార్ తవ్వకాలు చేస్తున్న కార్మికులపై మట్టిదిబ్బలు మీదపడటంతో ముగ్గురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు.