ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల వాహనాన్ని ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.