కుంభమేళాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి (వీడియో)

50చూసినవారు
ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఘోర రోడ్దు ప్రమాదం జరిగింది. జైపూర్ నుంచి కుంభమేళాకు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి.. బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. జైపూర్ నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు టైరు పగిలిపోవడంతో నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. కారు నుజ్జునుజ్జు అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్