ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారి-130పై గుమ్‌గా గ్రామానికి సమీపంలోని అదానీ గెస్ట్ హౌస్ సమీపంలో రాయ్‌పూర్ నుంచి అంబికాపూర్ వెళ్తున్న కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.