యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి (వీడియో)

58చూసినవారు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కన్నౌజ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వే పై ఆగి ఉన్న లారీని డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 19 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్