ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకిలోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు, టెంపో ట్రావెలర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.