యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రావస్తి జిల్లా వీన్ మోడరన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాట్రా బైపాస్ వద్ద అతివేగంతో వచ్చిన బైక్.. ట్రక్కును ఢీకొట్టింది. సోదరి పెళ్లి కార్డు పంచేందుకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.