AP: 24 గంటల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లా చాగలమర్రిలో జరిగింది. కోటాగడ్డ వీధికి చెందిన ముల్తా జహంగీర్ (60)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ముల్లా రబ్బాని (28) ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. బుధవారం గుండెపోటుతో రబ్బాని ప్రాణాలు విడిచాడు. కొడుకు మృతితో తండ్రి జహంగీర్ తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఆయనకూ గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు.