AP: చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన జరిగింది. కూతురు ప్రేమ వివాహం చేసుకుందని తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డారు. పెద్దల సమక్షంలో కూతురుని, అల్లుడిని రాజీకి పిలిచిన తండ్రి.. వాళ్ల సమక్షంలోనే ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అల్లుడిని, కూతురుని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.