సిద్దిపేట పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. చింతల్ చెరువులో దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులను తేలు సత్యం (48), అన్వేష్ (7) త్రివేణి (5)గా గుర్తించారు. మొదటి భార్య చనిపోవడంతో సత్యం రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రెండో భార్యతో విభేదాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపం చెందిన సత్యం తన ఇద్దరు పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు.