ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. “నా దేవుడికి ఫాదర్స్ డే విషెస్” అంటూ తన తండ్రితో ఉన్న ఓ అందమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ అభిమానుల హృదయాలను తాకింది. ఫ్యామిలీకి దగ్గరగా ఉండే బన్నీ తన తండ్రిపై చూపిన ప్రేమకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.