హైదరాబాద్ గోల్కొండలో హృదయాన్ని కలచివేసే ఘటన జరిగింది. గుల్షన్ కాలనీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న జగత్ అనే వ్యక్తి తన 14 రోజుల కూతురిని గొంతు కోసి హత్య చేశాడు. ఆయన భార్య ఇచ్చిన వివరాల ప్రకారం.. జగత్ మానసిక స్థిరత్వం కోల్పోయే స్థాయిలో కోపంతో వ్యవహరిస్తాడని తెలిపింది. పోలీసులు జగత్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.