టమాటో పంటకు వెచ్చదనం ఉన్న కాలంలో పంట దిగుబడి బాగావస్తుంది. వాతావరణంలో 21-24°C ఉష్ణోగ్రతల వద్ద పండ్ల రంగు నాణ్యత బాగుంటుంది. ఉష్ణోగ్రతలు 10°C కంటే తక్కువగా ఉంటె మొక్కల కణజాలంపై ప్రభావితం చేస్తుంది. తద్వారా మొక్క యొక్క ఎదుగుదల మందగిస్తుంది. ఉష్ణోగ్రత 32°C కంటే ఎక్కువగా ఉంటే పంటపై ప్రతికూల ప్రభావం వల్ల పంట దిగుబడి తక్కువగా వస్తుంది. మొక్కలు మంచు, తేమ పరిస్థితులను తట్టుకోలేవు. ఈ పంట కోసం మధ్యస్థ వర్షపాతం అవసరం.