తెలంగాణలో మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 22 వరకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు రూ.1000 ఆలస్య రుసుముతో చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.