TG: కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని చాలా రోజులైనా కొనడంలేదని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొనుగోలు కేంద్రంలో సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడతో అకాల వర్షాలకు తడిసి ముద్దైంది. లంచం ఇవ్వడంలేదనే తన వడ్లు కొనడం లేదని సదరు మహిళ ఆరోపిస్తున్నారు. భర్త లేకపోయినా కష్టపడి పండించానని తనని ఆదుకోవాలని ఒంటరి మహిళ వాపోయింది.