ఓ మహిళా యూట్యూబర్ ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన దారుణ ఘటన హరియాణాలోని భివానీలో చోటుచేసుకుంది. యూట్యూబర్ రవీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మరో యూట్యూబర్ సురేశ్ పరిచయమయ్యారు. వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో దొరికిపోవడంతో భర్త ప్రవీణ్ వారిని నిలదీశారు. దీంతో భర్తను చంపేందుకు ప్లాన్ వేశారు. వారిద్దరూ కలిసి ప్రవీణ్ గొంతు కోసి చంపి, మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి మురుగు కాల్వలో పడేశారు.