భారత్‌లో తగ్గిన ఫెర్టిలిటీ రేట్: UN

54చూసినవారు
భారత్‌లో తగ్గిన ఫెర్టిలిటీ రేట్: UN
భారత్‌లో ఫెర్టిలిటీ రేట్ పడిపోయిందని యునైటెడ్ నేషన్స్ (UN) ఓ నివేదికలో తెలిపింది. చాలామందికి ఫెర్టిలిటీ గోల్స్‌పై క్లారిటీ లేదంది. ఒక్కో మహిళ సగటు సంతాన రేట్ 1.9 జననాలకు పడిపోయినట్లు వెల్లడించింది. ఇది రిప్లేస్‌మెంట్ ఫెర్టిలిటీ రేట్ 2.1 కంటే తక్కువ అని తెలిపింది. ప్రస్తుత జనాభా సంఖ్య భవిష్యత్‌లో తగ్గకుండా మెయింటేన్ చేయడం కష్టమని పేర్కొంది. మరోవైపు ఈ ఏడాదిలో జనాభా 146 కోట్లకు చేరుతుందని యూఎన్ అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్